NLG: చిట్యాల పురపాలికలో కుక్కల బెడద తీవ్రమైంది. రాత్రి సమయాల్లో పదో వార్డులో కుక్కలు గుంపులు, గుంపులుగా ఉండి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇల్లు చేరుకునేందుకు భయంతో వణుకుతూ వస్తున్నామని తెలుపుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని మాజీ వార్డు సభ్యుడు దాసరి నరసింహ కోరారు.