TG: కరీంనగర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నరేష్ అనే వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారు. స్నేహితుడు రాకేష్, డ్రైవర్ ప్రదీప్తో కలిసి చంపేసి అన్న వెంకటేష్ పేరుపై వచ్చిన రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.