ప్రకాశం: కంభంలోని పంచాయతీ ఆవరణలో మంగళవారం సాయంత్రం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే విధంగా రైతులకు దిశానిర్దేశం చేసేందుకు సీఎం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.