నిజామాబాద్-నవీపేట మధ్య డబ్లింగ్ పనుల నిమిత్తం నవీపేట రైల్వే లెవల్ క్రాసింగ్ గేటును రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గేటును మూసి ఉంచుతారు. నిజామాబాద్-బాసర మార్గంలో జన్నేపల్లి మీదుగా, బాసర-బోధన్ మార్గంలో ఫకీరాబాద్-సాటాపూర్ గేట్ మీదుగా దారి మళ్లింపు ఉంటుంది.