కృష్ణ: గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు ఆయన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు, అధికారులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించారు. పలుసమస్యలను MLA వెంటనే పరిష్కరించగా, మిగతావి సంబంధిత విభాగాలకు పంపించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని MLA పేర్కొన్నారు.