TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో బాలాదీపం (భరణి) ఉత్సవం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేపట్టారు. దీప, ధూప, నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పంచ దీపాలను వెలిగించి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా ఆలయంలోని స్వామి, అమ్మవార్లను గర్భగుడిలో ఉంచారు.