NZB: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ 2.0 పథకంలో భాగంగా బోధన్ పట్టణ మాస్టర్ ప్లాన్ కోసం బుధవారం నుంచి క్షేత్ర స్థాయి సర్వే ప్రారంభం కానుందని మున్సిపల్ కమీషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. పట్టణ భవిష్యత్తు ప్రణాళికకు ఈ సర్వే అత్యంత కీలకమని ఆయన వెల్లడించారు. సర్వే సిబ్బందికి పట్టణ ప్రజలు, ఇంటి యజమానులు పూర్తి సహకారం అందించాలని కమీషనర్ ప్రకటనలో కోరారు.