KDP: పులివెందుల ఆర్అండ్బీ వసతి గృహంలో మంగళవారం పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాల 22 హాస్టల్ వార్డెన్లతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భోజనంలో నిర్లక్ష్యం సహించబోమని, హాస్టళ్ల నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన వార్డెన్లను హెచ్చరించారు.