విశాఖలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కొద్దిరోజులుగా ఉదయం, రాత్రి వేళల్లో నగరాన్ని మంచు తెరలు కమ్ముకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచులో తిరగవద్దని, చలి గాలులు పీల్చడం వలన శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అవసరమైతే తప్ప చలి వాతావరణంలో తిరగరాదని వారు సూచిస్తున్నారు.