ADB: ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మంగళవారం రాత్రి సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. వారితో పాటు అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఉన్నారు.