ప్రకాశం: పొదిలి మండలంలోని కంబాలపాడు, మాదాలవారిపాలెంలో మంగళవారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆయన పేర్కొన్నారు.