W.G: జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్ పరిధిలో అత్యాధునిక కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 29.97 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర వాటా కింద ఉన్న రూ. 4.49 కోట్లలో, తొలి విడతగా సగం నిధులు రూ. 2.24 కోట్లు మంజూరు అయ్యాయి.