ATP: జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ కళాశాలలో డెక్కన్ ఫైన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 8 మంది విద్యార్థులు ఉద్యోగులకు ఎంపికయ్యారు. వీరికి ఏడాదికి రూ. 4.75 లక్షల వేతనం ఇవ్వనున్నారు. ఎంపికైన విద్యార్థులను జేఎన్టీయూ అనంతపురం వీసి ప్రొఫెసర్ హెచ్. సుదర్శన్ రావు అభినందించారు.