TG: హయత్నగర్లో బాలుడిపై కుక్కల దాడి ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, కమిషనర్ స్వయంగా వెళ్లి పరామర్శించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.