ELR: పోలవరం మండలంలోని ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాల రైతులకు 120 టార్పాలిన్లు ఉచితంగా సరఫరా చేయడం జరిగినది. రైతులందరూ ఈ బరకాలు ధాన్యం రాశుల మీద కప్పుకుని దాన్యం పాడవకుండా జాగ్రత్త పడాలని అధికారులు కోరారు. ధాన్యం అమ్మేటప్పుడు తిరిగి సొసైటీలో తీసుకున్న బరకాల అందజేయాలని చెప్పారు. పాత పట్టిసీమ సొసైటీ నందు బరకాలను సొసైటీ ప్రెసిడెంట్ నునకానీ రాంబాబు అందజేశారు.