WGL: దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఈసారి జనరల్ కేటగిరీగా రిజర్వ్ కాగా.. MLG మాజీ SI పోరెడ్డి లక్ష్మారెడ్డి అమెరికాలో ఉంటూ సర్పంచ్ పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ఆన్లైన్లో నామినేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని సంతకం పెట్టిన ఆయన, స్పీడ్ పోస్టు ద్వారా రిటర్నింగ్ అధికారి భద్రమ్మ వద్దకు చేరేలా పంపారు. నామినేషన్ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.