BPT: బాపట్ల జీడిమామిడి పరిశోధన కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం సందర్శించారు. నూతన వంగడాలను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ఇవి రైతుల ఆదాయానికి భరోసా ఇస్తాయని పేర్కొన్నారు. అంటుమొక్కల నర్సరీని పరిశీలించి, నాణ్యమైన మొక్కల ఉత్పత్తిపై అధికారులకు పలు సూచనలు చేశారు.