BPT: బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ హాలులో బీపీఎస్-2025పై అవగాహన సదస్సు జరిగింది. కమిషనర్ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ పాల్గొన్నారు.1985 జనవరి 1 నుంచి 2025 మార్చి 31 మధ్య నిర్మించిన అనధికార భవనాలను బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. ఈ పథకంపై భవన యజమానులకు అవగాహన కల్పించారు.