ADB: ఇచ్చోడలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ పాల్గొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.