ప్రకాశం: ఒంగోలు నగరంలోని SS ట్యాంకు వద్ద స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమిమ్ అన్సారీయా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చీపురు పట్టి చెత్తను తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవితంలో స్వచ్ఛతను ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.