VZM: హజరత్ సయ్యద్ డెంఖేషావలీ బాబా రహమతుల్లా అలైహి 308వ ఉరుసు ఉత్సవాలలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులు ఖాదీమ్ షేక్ బహదూర్,షేక్ షాజహాన్, సిద్ధిక్ తదితరులు విక్రమ్‌ని సాదరంగా ఆహ్వానించి, పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని విక్రమ్ ప్రారంభించారు.