మేడ్చల్: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు గొప్ప వరమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం మజీద్ పూర్ గ్రామానికి చెందిన అబ్బగౌని శంకరమ్మకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ రూ.52,500 చెక్కును ఆమె కొడుకు బిక్షపతికి మల్లారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు.