VZM: విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ కృషి ఫలితంగానే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడం జరిగిందని ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. శనివారం విశాఖపట్నంలో గల తన క్యాంప్ కార్యాలయంలో వారిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.