VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి కూలీల అడ్డాగా మారింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డుపై వందలాది కూలీలు గుమిగూడటంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కూలీల కోసం ప్రత్యేక అడ్డాను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.