అన్నమయ్య: జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్లో సోమవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్వాడ్ బృందాల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బెదిరింపు పుకారేనని అధికారులు నిర్ధారించగా, ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్పీ ధీరజ్ సూచించారు.