PLD: నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న వారిపై రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. గుప్త సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.