MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏడు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు భారీ ఎదురు గాలులతో గంటకు పైగా భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాను పునరుద్దించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామాలలో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు.