ప్రకాశం: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ సందర్శించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి ఏర్పాట్లు ఎస్పీ పరిశీలించనున్నారు.