ప్రకాశం: ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కొండపి సీఐ సోమశేఖర్ లాడ్జిలను తనిఖీ చేశారు. మంగళవారం తెల్లవారుజామున లాడ్జిలలో బసచేసే వ్యక్తుల వివరాలను సక్రమంగా నమోదు చేయడం తప్పనిసరి అని, సీసీ కెమెరాలు ఎప్పుడు పనిచేశాలా చూసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. అనుమానాస్పద కదలికల గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు.