గుంటూరులో రైల్ సేవా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. రేపు డీఆర్ఎం సుధేష్ణ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుకు మొత్తం 14 మంది ఉద్యోగులు ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో విశేష సేవలందించిన సిబ్బందికి ఈ గౌరవం లభిస్తోంది. ఈ కార్యక్రమం పట్టాభిపురంలోని రైల్ వికాస్ భవన్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.