AP: రాష్ట్రంలో ఇవాళ భిన్న వాతావరణం ఉండనుంది. ద్రోణి ప్రభావంతో SKL, అల్లూరి, పోలవరం, KNL, నంద్యాల, VZM, మన్యం, VSKP, నెల్లూరు, ATP జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని APSDMA తెలిపింది. మన్యం, పోలవరం, విజయనగరం, తూ.గో, ఏలూరు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.