NLR: వింజమూరులోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ASW రమణారెడ్డి ఇవాళ తనిఖీ చేశారు. విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కష్టపడి చదవాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం హాస్టల్లోని గదులను, టాయిలెట్లను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు.