గుంటూరు నగరపాలక సంస్థ సెక్రటరీ ఎ.పవన్ కుమార్ను అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేస్తున్నట్లు పై అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తి పన్ను, LRS నగదును దుర్వినియోగం చేసి, తక్కువ మొత్తాలకు నకిలీ రశీదులు సృష్టించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు.