SRPT: కోదాడ మున్సిపాలిటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 6,345.00 లక్షల బడ్జెట్ను సోమవారం ఆమోదించింది. మున్సిపల్ చైర్ పర్సన్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో నాన్-ప్లాన్ గ్రాంట్లు రూ. 1130 లక్షలు, ప్రణాళికా నిధులు రూ. 865 లక్షలు, ఇతర గ్రాంట్ల కింద రూ. 2090 లక్షలను కేటాయించారు.