KRNL: వెల్దుర్తి మండలం ఎల్.బండకు చెందిన చాకలి చిన్న ఎల్లయ్య అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం 1992-93 పదవ తరగతి పూర్వ విద్యార్థులు మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. తమ వంతు సహాయంగా రూ. 35,800 నగదును అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మానవత్వాన్ని చాటుతూ.. కుటుంబానికి తోడుగా ఉంటామని పేర్కొన్నారు.