సత్యసాయి: మడకశిరలోని తన క్యాంపు కార్యాలయంలో ఇవాల నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.