ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడిషనల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీమతి కృష్ణ దాస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఏయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయోగశాలలు, హెర్బేరియం, ఏయూ డాక్టర్ వి.ఎస్.కృష్ణ గ్రంధాలయాలను తనిఖీ చేశారు. అనంతరం ఆమెను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.