సత్యసాయి: గోరంట్ల మండలం బూదిలి గ్రామంలో నేసేవారి వీధి నుంచి రామస్వామి దేవస్థానానికి వెళ్లే సీసీ రోడ్డును మురికి కాలువ శుభ్రం చేసే పనులలో భాగంగా తొలగించారు. అయితే 5 నెలలు గడిచినా రోడ్డు పునర్నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని ధర్నా నిర్వహించి పంచాయతీ కార్యదర్శి రాముకి ఇవాళ అర్జీ సమర్పించారు.