ATP: శింగనమల ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన చలివేంద్రం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఎస్సై విజయ్ కుమార్ ప్రారంభించారు. వేసవిలో ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గ్రామస్తులు ఇలాంటి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని అభినందించారు.