కడప నగరంలోని YSR ప్రెస్ క్లబ్లో మున్సిపల్ పన్నుల వసూళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కార్పొరేషన్ అధికారులు ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లలో సంపన్నులను వదిలేసి పేదలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.