GNTR: మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన మూడు పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కేసును CBIకి అప్పగించాలని, CM చంద్రబాబుకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, ACB కోర్టు విచారణను MP, MLAల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఆర్కే పిటీషన్లు దాఖలు చేశారు. కాగా, వాటిని హైకోర్టు కొట్టివేసింది.