దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండేళ్ల క్రితం విధించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు తమ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. ఇవాళ లోక్‌సభలో నక్సలిజం నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా 130-150 మంది సాయుధ మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని నిఘా వర్గాల అంచనా.