JN: రఘునాథపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ.. కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని, అనునిత్యం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ అవినీతి మచ్చలేని నాయకుడిగా కడియం శ్రీహరి పేరు సంపాదించుకున్నారన్నారు.