విశాఖ గాజువాక నియోజకవర్గంలో ఎస్సీ కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లిల్లి పెంటరాజు అన్నారు. సోమవారం గాజువాకలో ఆయన పర్యటించారు. చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, కాంపౌండ్ వాల్ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు. ఎస్సీ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి కట్టుబడి ఉన్నామని అన్నారు.