AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇవాళ ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు, అనంతపురంతోపాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.