AP: శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు ఇవాళ వైసీపీ నేతలు వెళ్లనున్నారు. కాగా, పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నౌపడ జంక్షన్ దగ్గర మాత్రమే వైసీపీ సభకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. న్యాయబద్ధమైన కార్యక్రమాన్ని కూటమి సర్కారు అడ్డుకుంటోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.