KMR: గాంధారి మండలం సీతాయిపల్లిలో రుక్మవ్వ (73) హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బంగారం, డబ్బుల కోసం కోడలు కోటవ్వ తన అత్తను బండతో కొట్టి చంపినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం ఏమీ తెలియనట్లు డ్రామా ఆడింది. పోలీసుల విచారణలో నిజం తేలింది. నిందితురాలి నుంచి 15 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఆదివారం రిమాండ్కు తరలించారు.