»Devara Glimpse Shatters Guntur Kaaram Sets A New Benchmark
Devara: గుంటూరు కారంను పక్కకు తోసి.. కొత్త రికార్డు క్రియేట్ చేసిన దేవర
ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేవర గ్లింప్స్ గుంటూరు కారం సినిమాను పక్కకు తోసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఆ తర్వాత ఆయనకు వరస అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో దేవర మూవీ కోసం శ్రమిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. పాన్ ఇండియన్ సినిమా దేవర గ్లింప్స్ నిన్న విడుదల చేశారు. ఈ వీడియోకి అందరి నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
దేవర గ్లింప్స్ 24 గంటల్లో 26.2M వీక్షణలను పొంది తెలుగులో మునుపటి టీజర్ రికార్డులను బద్దలు కొట్టింది. 21 మిలియన్ల వీక్షణలతో మహేష్ బాబు గుంటూరు కారం మొన్నటి వరకు టాప్‌లో ఉండగా, ఎన్టీఆర్ దేవర రికార్డును భారీ తేడాతో బద్దలు కొట్టింది. తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా గ్లింప్స్ ఆఫ్ దేవరకు మంచి స్పందన వచ్చింది. హిందీలో ఇది 24 గంటల్లో 18.5M వీక్షణలను నమోదు చేసింది. ఇది ఒక సంచలనాత్మక ఫీట్‌గా చెప్పొచ్చు. పాన్ ఇండియన్ విడుదలకు అద్భుతమైన పుష్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం తమిళ, మలయాళ గ్లింప్స్ దాదాపు 1.1 మిలియన్ల వీక్షణలను పొందాయి.
ఓవరాల్‌గా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవర నిర్మాతలు టీజర్ OSTని విడుదల చేశారు. దేవర రెండు భాగాల సినిమా అని అందరికీ తెలిసిందే. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం పాటలు, నేపథ్య సంగీతం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.