Vijay Sethupathi: పడిపోతున్న విజయ్ సేతుపతి మార్కెట్..? షాకింగ్ నిర్ణయం
విజయ్ సేతుపతి హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇకపై విలన్ పాత్రలు చేయనని సమాచారం. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
Vijay Sethupathi: నటుడు, విజయ్ సేతుపతి కి పరిచయం అవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా చేస్తూనే విలన్ కూడా అలరించగలరు. అతనిని అభిమానులు మక్కన్ సెల్వన్ అని పిలుస్తారు. దక్షిణ భారత చలనచిత్రంలో సుపరిచితమైన పేరు. ఈ విక్రమ్ వేద స్టార్ త్వరలో శ్రీరామ్ రాఘవన్ రాబోయే థ్రిల్లర్ మెర్రీ క్రిస్మస్లో కత్రినా కైఫ్‌తో కలిసి నటించనున్నారు. సాధారణంగా హీరోలు కీలకమైన పాజిటివ్ క్యారెక్టర్ అయితే తప్ప ఇతర సినిమాల్లో విలన్ రోల్స్ లేదా క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ఇష్టపడరు. కానీ విజయ్ సేతుపతి లీడ్ హీరోగా మంచి మార్కెట్ ఉన్నప్పుడే ఇతర హీరోల సినిమాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు.
సేతుపతి విలన్‌గా భారీ ఆఫర్లు పొందాడు, కానీ అది హీరోగా అతని మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. విజయ్ సేతుపతి ఇటీవల ఆ విషయాన్ని గ్రహించి, ఇక నుంచి కొన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా విలన్ పాత్రలు చేయనని, ప్రధాన పాత్రలపై మాత్రమే దృష్టి సారిస్తానని చెప్పినట్లు సమాచారం. జవాన్ విడుదల తర్వాత విజయ్ సేతుపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో, హీరో ఎలివేషన్‌ను పెంచడానికి జవాన్‌లో చాలా సన్నివేశాలను ఎడిట్ చేశారని చెప్పాడు.
విజయ్ తర్వాతి చిత్రం మెర్రీ క్రిస్మస్ జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇక నుంచి విజయ్ సేతుపతి లీడ్ హీరోగా మాత్రమే సినిమాలు చేయనున్నాడు. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, సంజయ్ కపూర్, వినాయక్ పాఠక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.