బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ జవాన్ ట్రైలర్(Jawan Trailer) విడుదలైంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
బాలీవుడ్ బాద్ షా.. షారూఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’ ట్రైలర్ విడుదలైంది. అట్లీ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ ను ఈరోజు(ఆగస్టు 31న) ఉదయం 11:58 గంటలకు మేకర్స్ రిలీజ్ చేశారు. అనగనగా ఒక రాజు అనే డైలాగ్ తో ట్రైలర్ వీడియో మొదలవుతుంది. నీకు కావాల్సింది ఎంటో చెప్పు అనగా..ఆలియా భట్ కావాలని షారూఖ్ చెప్పడం సహా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మేము జవాన్లము దేశం కోసం ఏదైనా చేస్తామని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు నా కొడుకు మీద చేయ్యి వేసే ముందు వాడి బాబు మీద చెయ్యి వేయమని సేతుపతి చెప్పే డైలాగ్ ఉత్కంఠ రేపుతోంది. ఇక ఫైట్స్, ఛేజ్ సీన్స్ అయితే సినిమాపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
అయితే ఆర్యన్ ఖాన్ ‘జవాన్’ ట్రైలర్‌ను వీక్షించిన మొదటి వ్యక్తి అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘జవాన్’ ట్రైలర్‌ను నిజంగా ఆస్వాదించాడని చెప్పుకొచ్చారు. ‘స్టార్డమ్’ అనే వెబ్ సిరీస్‌తో ఆర్యన్ దర్శకుడిగా మారుతున్నాడు. ‘పఠాన్’ ట్రైలర్ సమయంలో కూడా, ఆర్యన్ తన అభిప్రాయాన్ని SRKకి అందించాడు. దాని గురించి తనకు నచ్చిన వాటిని చెప్పాడు. ఈ ఏడాది అత్యంత ఎదురుచూసిన చిత్రాలలో జవాన్ ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్ 7న ఈ మూవీ పలు భాషల్లో విడదల కానుంది.
ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. SRK తో పాటు, జవాన్ స్క్రిప్ట్‌ను అట్లీ, S రమణగిరివాసన్ సంయుక్తంగా రాశారు. సుమిత్ అరోరా సంభాషణలు అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిన జవాన్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.